Wednesday, April 30, 2014

మానవసేవలో మాధవసేవను చూస్తూ ... సహృదయతతో అనాధ,పేద బాలలను విద్యాపరంగా        5 సంవత్సరములు దత్తత తీసుకొన్న మా దాతలు, వారి దత్తత వివరాలు .... 

1. శ్రీ వంటపాటి వరప్రసాద్  - 75 మంది విద్యార్థులు
2. శ్రీ గొట్టుముక్కల వెంకట సుబ్బరాజు ఫౌండేషన్ - 45 మంది విద్యార్థులు
3. శ్రీ చుండూరి వెంకట్రావు - 20 మంది విద్యార్థులు
4. శ్రీ వానపల్లి లీలాప్రసాద్ - 20 మంది విద్యార్థులు
5. శ్రీ డా. రామరాజు - 20 మంది విద్యార్థులు
6. శ్రీ డా .ఎం .వి. సూర్యనారాయణరాజు - 10 మంది విద్యార్థులు
7. శ్రీ డా . రఘునాధరాజు  - 10 మంది విద్యార్థులు
8. శ్రీ భైరి సిమ్హాచెలం - 10 మంది విద్యార్థులు
9. శ్రీ వంటపాటి అయ్యన్నబాబు - 10 మంది విద్యార్థులు
10. శ్రీ డా . నవీన్ ( ఆకివీడు) - 20 మంది విద్యార్థులు
11. శ్రీ జుంగా  దాస్ - 5 మంది విద్యార్థులు
12. శ్రీ జాస్తి బాల కోటేశ్వరరావు (ఏలూరు) - 50 మంది విద్యార్థులు
       మన చుట్టూ ఉన్న సమాజానికి, చదువుకున్న పాటశాలకు సహాయం చేయాలని మన అందరికీ అనిపిస్తుంది . ఇప్పటికీ చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్న విద్య్యార్తులకు సహాయపడటం మన కనీస భాద్యతగా భావించే వారికోసం ఒక ఉమ్మడి వేదికగా మేము ఉన్నాము. మాతో కలిసే చేతులకు సాదరంగా ఇదే మా ఆహ్వానం .....  

Wednesday, April 23, 2014

Society of Helping Hands, Why? What? Who? Where?

మేం బలంగా నమ్మాం ..... ప్రార్దించే పెదవులు కన్నా ... సాయెం చేసే చేతులు మిన్న అని ....
మనకన్నా వెనుకబడిన వారికి  విద్యను  అందించగలిగితే, ఆ విద్య వారిని అన్ని రకాలుగా, ఆదుకుంటుదని ... 

 ఇప్పటికీ చదువుకోటానికి సహాయ అందించే మనసున్న మనిషి కోసం ఎదురుచూస్తున్న  అనాధ/పేద  బాల బాలికలు అనేకమంది మనచుట్టూ (ప్రభుత్వ పాటశాలలలొ ) ఉన్నారు ...ఈ నిరుపేద బాలలకు విద్యాపరంగా సహాయం అందించాలని , వీరి విద్య నిరాటంకంగా కొనసాగే ఏర్పాటు చేయాలనీ, వీరికి భవిష్యత్తుపై భరోసా కల్పించాలని తలచి సొసైటీ ఆఫ్ హెల్పింగ్ హాండ్స్ ను ఒక సమర్ధమైన, పారదర్శకమైన వేదికగా ఏర్పాటు చేసాం ... 

గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తున్నాం ... ప్రభుత్వ పాటశాలలో చదువుతున్న విద్యార్థులను  మాత్రమే  ఎంపిక చేస్తున్నాం ... విద్యార్థుల ఎంపికలో సంబందిత పాటశాల          ప్రదానోపోద్యాయులు , తరగతి టీచర్ల అభిప్రాయానికి ప్రాధాన్యతను  ఇస్తున్నాం... అనాధలకు, బాలికలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాం .... 
విద్యార్థుల దత్తత కార్యక్రమం ద్వారా 6 నుంచి 10 వ తరగతి వరకు ( 5 సం.ల కాలం) నిరంతరాయంగా విద్యార్థికి అవసరమైన అన్ని రకాల విద్యాసామాగ్రిని అందిస్తున్నాం ... కనిష్టంగా 5గురు విద్యార్థులను దాతలకు దత్తతకు ఇస్తున్నాం... దత్తత తీసుకొన్న దాతపేరున వీరికి సహాయాన్ని అందిస్తున్నాం ... దత్తత తీసుకొన్న దాతల చేతుల మీదుగామాత్రమే ఈ సామాగ్రిని అందిస్తున్నాం ...ఇన్వాఇస్ ధరలకే విద్య్హాసామాగ్రిని కొనుగోలు చేయడం వలన  పూర్తిస్తాయిలో న్యాయం చేయగలుగుతున్నాం... సంస్త దత్తత తీసుకున్న విద్యార్తులకు హెల్త్ కార్డుల ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం... కార్యక్రమం రోజునే సంబందిత బిల్లులను దాతలకు అందిస్తున్నాం ...సహయాన్ని చెక్కుల రూపంలో మాత్రమే అంగీకరిస్తున్నాం ... విద్యార్థుల పూర్తి విద్యాపరమైన సమాచారాన్ని, హాజరు వివరాలను, దాతల వివరాలను సమయానుసారంగా (ఫేస్ బుక్ , బ్లాగు, వెబ్ సైటు , పోస్ట్  ద్వారా )  దాతలకు అందిస్తున్నాం ....    దేశంలో ఏ సంస్తా అనుసరించని పారదర్శకతను పాటిస్తున్నాం  అని  గర్వంగా చెబుతున్నాం...

రూ. 600/-కే (రూ.1000/- విలువగల) ఒక విద్యార్థికి  సంవత్సర కాలానికి అవసరమైన పూర్తి విద్యాసామాగ్రిని అందిస్తున్నాం... వీరికి  చదువుపై ఆసక్తిని, భవిష్యత్తుపై భరోసాని కల్పిస్తున్నాం .... మన కుటుంబం ఒక్క రోజు రెస్టారెంట్లో భోజనం చేసిన ఖర్చుతో 5గురు విద్యార్థులు చదువుకోగలరన్నఅంశాన్ని గమనించవలసిన్దిగా విజ్ఞప్తి చేస్తున్నాం ... 

అమ్మ జన్మను ఇస్తే , చదువుకున్న పాటశాల జీవితాన్ని ఇస్తుంది. తల్లి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది,  కానీ ! చదువును, తద్వారా ఈ  రోజున సమాజంలో గౌరవమైన జీవితాన్ని ఇచ్చిన పాటశాల ఋణం తీర్చుకునే అవకాశం  ఉంది ... అది పాటశాలలో పూర్వ విద్యార్థుల కలయికో, వేడుక చేసుకోవడమో, సన్మానం చేయడంలో మాత్రమే లేదు,  బడికి బల్లలొ , బీరువాలో కొనిపెట్టడం అంతకన్నా కాదు ... మనం చదివిన చోటే చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్న పిల్లలు ఇంకా ఉన్నారు, తల్లితండ్రులు లేనివారు కొందరైతే , ఉన్నా పట్ట్టించుకోక, చదువుకోలేక కొందరు , చదువు విలువ తెలియని వారు ఇంకొందరు ఉన్నారు... వీరి చదువుకు సహాయం చేయడంద్వారా  ఆదుకోవచ్చును. మన ఒక్కరోజు సరదా ఖర్చుతో 5గురు పేద బాలలు సంవత్సరకాలం  చదువుకోగలుగుతారు... ఇంతకు మించిన ఋణం తీర్చుకునే మార్గం ఉన్నదా ? ఇదే మార్గం అనుకున్నాం , బలంగా నమ్మాం , అనుకున్నదానినే  ఆచరిస్తున్నాం ...మీకూ అవకాశం ఉంది, మీ పాటశాలకు సాయం చేసే ఉద్దేశం ఉంటే, మాతో చేతులు కలపండి , సాయం చేసే మనసే మీది మిగతా పని అంతా మాది .... 
 2011 సం.లో పశ్చిమ గోదావరి జిల్లా , ఆకివీడు మండలం, చినమిల్లిపాడు గ్రామంలో 10 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు సమీప ప్రాంతాలకు విస్తరించి 300 విద్యార్థులకు సహాయం అందించడం జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఈ మహత్తరమైన కార్యక్రమం విస్తరించాలని, మనసున్న దాతలకు, సహాయం కోసం చూస్తున్న విద్యార్థులకు సమర్ధమైన వారధిగా ఈ సంస్థను నిలపాలని భావిస్తున్నాం ... 

విద్యా విషయమే కాకుండా పర్యావరణం, త్రాగునీరు, ప్రజాస్వామ్య సంస్కరణలు, స్త్రీ సాధికారత తదితర అంశాలపై కృషి చేస్తున్నాం. పర్యావరణ పరంగా అవకాశం  ఉన్న ప్రాంతాలలో కొత్తగా మొక్కలు నాటుతున్నాం, ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్లో 30 మొక్కలను నాటడం జరిగింది . పర్యావరణ ప్రేమికులకు నూతనంగా నాటుతున్న మొక్కలను దత్తత ఇవ్వడం ద్వారా నూతన ఒరవడికి నాంది పలికాం... దత్తత తీసుకోవడమే మీ వంతు...పెంచి పెద్ద చేసే భాద్యత మేం తీసుకుంటాం ... కేవలం 1000/- లతో ఓ మొక్కను పెంచి పోషించడమే కాక, ఈ కార్యక్రమంలో మొక్కల ;పోషణలో పాలుపంచుకుంటున్న కొన్ని కుటుంబాలకు జీవన బృతి కల్పిస్తున్నాం... 

ఓటు హక్కుపై చైతన్యం కల్గించే కార్యక్రమాలు చేపడుతున్నాం, ఓటును నోటుకి అమ్ముకునే విష సంస్కృతికి విరుద్దంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాం, కరపత్రాలు, గోడ పత్రికలు ద్వారా, ర్యాలీల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నాం... పాటశాలలలో, కళాశాలలలో ఈ అంశాలపై వ్యాసరచన పోటీలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం... విశిష్ట వ్యక్తుల ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ...

మేం ఆంధ్రప్రదేశ్ సొసైటీల చట్టం పరిధిలో 2013 సంవత్సరంలో నెం . 119/2013 ద్వారా రిజిస్ట్రేషన్ పొందటం జరిగింది . సంస్తకు ప్రస్తుత అధ్యక్షులుగా ఆకివీడు ప్రాంతంలో ప్రముఖ వైద్యులైన శ్రీ  శ్రిమందపాటి రఘునధరాజు గారు, కార్యదర్శిగా విద్యావేత్త శ్రీ సింగవరపు కోటేశ్వరరావు గారు , సభ్యులుగా ప్రముఖ  శిశు వైద్యులైన డాక్టర్ . రామరాజు గారు,  విద్యావేత్త శ్రీ వంటపాటి అయ్యన్న బాబుగారు, అక్కౌంటి  ంగ్  నిపుణులు శ్రీ భైరి సింహాచెలం గారు, శ్రీ మోసుగంటి శ్యామలరావు గారు, వ్యాపారవేత్త  శ్రీ మాటూరి మధు గారు కొనసాగుతున్నారు. 

ప్రస్తుతం ఆకివీడు ఉన్నత పాటశాల, ఆకివీడు ఉన్నత బాలిక పాటశాల, పెదకాపవరం ఉన్నత పాటశాల, చెరుకుమిల్లి ఉన్నత పాటశాల, ఆకివీడు బాలసదన్ , పెదపాడు ఉన్నత పాటశాలలలో విద్యను  అభ్యసిస్తున్న పేద బాలలను దత్తత తీసుకోవడం ద్వారా వారికి ప్రోస్తాహాన్ని ఇస్తున్నాం.   అప్పనవీడు, సత్యవోలు ఉన్నత పాటశాలలకు దత్తత కార్యక్రమాలను విస్తరిస్తున్నాం... 

శ్రీ వంటపాటి వరప్రసాద్ ( యు.కె. ), గొట్టుముక్కల వెంకట సుబ్బరాజు ఫౌండేషన్ , డా . రామరాజు, డా.ఎమ్. వి. సూర్యనారాయణ రాజు , డా . రఘునాధరాజు, చుందూరి వెంకటరావు , భైరి సింహాచెలం , జుంగా దాస్ , వంటపాటి అయ్యన్న బాబు, సంస్తకు ప్రధానమైన దాతలుగా , వ్యహరిస్తూ సంస్త కార్యక్రమాలు ముందుకు సాగటానికి దోహదపడుతున్నారు. వీరి సహృదయానికి సంస్త  తరపున మనఃపూరక అభినందనలు తెలియజేస్తున్నాం ... 

ఉత్తమ సమాజం, ఉన్నతమైన సమాజం.... ఇదే మా తపన, తపస్సు

 


Thursday, April 10, 2014

అనాధ , పేద విద్యార్ధులను దత్తత తీసుకొన్న మా దాతలు ....

హెల్పింగ్ హాండ్స్ సంస్తకు ఆరంభం నుంచి మద్దతు ఇస్తున్న మిత్రులు శ్రీ వంటపాటి వరప్రసాద్ గారు, ఆకివీడు ,       ( యు. కె . ) 75 మంది విద్యార్ధులను దత్తత తీసుకొన్నారు. ఆకివీడు మండలంలో చదువుతున్న ఈ విద్యార్థులకు  10వ తరగతిపూర్తయ్యే వరకు వీరుసహాయం అందించడం జరుగుతుంది. వీరి సహృదయానికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం ...

Tuesday, April 8, 2014